Thursday, February 1, 2007

Easy Home theater setup on your own.

Under Construction లో వున్న ఇల్లు,అదీ ఫ్యామిలీ రూములో, 5.1/7.1 Sound System (Home Theater sound) సొంతంగా సెటప్ చేసుకోవటం అనుకున్నంత కష్టమేమి కాదు. నేను ఇల్లు కడుతున్నప్పుడే సొంతంగ wiring చెసుకున్నా.నాకు అదో Hobby. Electronics related పని ఏది వున్నా నాకు హ్యాపి.

నాలాంటి hobbiests కి ఇది పనికి వస్తుందేమో?

ఓక్కొక్క భిల్డర్ ఒక్కొక్క price quote చేస్తారు Audio system(Home theater) సెటప్ కి.నాది చాలా complicated and customized సెటప్ కాబట్టి నేనే చేసుకోవడం బెట్టర్ అనుకున్న. అదీ కాక నా hobby సంగతి తెలిసిందే కదా.

Bose Audio system అంటే మన వాల్లు పడి చస్తారు అన్న విశయం వేరే చెపక్కర్లేదు.నన్ను కూడా ఆ క్లబ్బులో చేర్చుకోవచ్చు. కొంత మంది different గా వెల్దామని చూస్తారు, కొంత మంది price యెక్కువ అంటారు గాని నేను మాత్రం Bose మీద ఫిదా. అమరికన్ ప్రెస్ కి Bose మీద యెందుకో గాని మంచి opinion లేదు, యే రివ్యు చూసినా Onkyo, Dannon లాన్టి బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తారు.

మరి Bose కేమో అంత reputation వుంది. చాలా confusing గానే వుంటుంది Home theater shopping research లో, అందుకే లాభం లేదని నేనే రంగంలో కి దిగాను. ఎన్నింటినో trial, demo, కొని మల్లీ return( Test drive) యివ్వడం చేసి, ఆఖరికి Bose ని మించింది లేదు అని డిసైడ్ చేసుకున్నాను.
Home theater audio's performance comparison next బ్లాగులో detailed గా డిస్కస్ చేసుకుందాం.

So ఇంక మన సెటప్ details కి వస్తే...

నా environment:

6 మూలలు, 5 openings తొ 18x20 ఫ్యామిలి రూము, Framing అయ్యి ఇంకా Sheet rock పని కాలేదు, wiring చెయ్యాల్సింది 5.1 system కి.


కావల్సిన సామగ్రి:

టిప్: అన్ని కావల్సిన సామగ్రి, కొత్తవయినా, పాతవయినా ఏమి తేడా రాదు, So Ebay లేక local craigslist లో used వి తీసుకోవచ్చు.

1)Atleast minimum 18v Power drill వుంటే better.ఇవి చాలా pricey గా వుంటాయి, So Home Depot/Lowes లో రెంట్ చెయ్యటం బెట్టర్. నేనైతే ఒక అమెరికన్ ఫ్రెండ్ దగ్గర borrow చెసాను. Regular గా Hardware పని hobby గా చెసుకొనే వాల్లు కొనటం బెట్టరేమో.Cordless ఐతే చాలా సుఖం. కాని దాని Performance, cord drills కి వున్నంత వుండదని అంటారు. ఇంకా ambitious గా వుంటే more powerfull వాటికి వెల్లొచ్చు.నేను తరువాత నా పెర్సొనల్ ఉసె కి కొన్నది మాత్రం 12v ది ( మామూలు చిన్న చిన్న పనులకి సరిపోతుంది, sheet rock డ్రిల్ల్ చెయ్యటం, screwing, unscrewing etc;) కాని మనం చెయ్యబొయ్యే పనికి మాత్రం stud కి అడ్డంగా hole చెయ్యలి అంటే కొంచం ఎక్కువే power వుండాలి.ఢ్రిల్ల్ బిట్స్ కూడా variuos sizes ఒక సెట్ లా దొరుకుతవి మార్కెట్లో.

2)Speaker wires మార్కెట్లో చాలా రకాలు దొరుకుతాయి , వాటి prices wires quality పైన కొద్దో గొప్పో depend అవుతుంది. కాని ఎదయినా reasonable quality తో పోవడం బెట్టర్. Speaker wires కి gauge ముఖ్యం, 16 లేక 18 gauge మన అవసరానికి సరిపోతాయి. Monster cables ఇంకా higher gaugeతొ దొరుకుతాయి కాని వాటి price అదిరిపోతుంది, sound quality లో కూడా పెద్ద తేడా ఏమి రాదు.నేను కొన్న wఇరె ఫొటోలో చూడొచ్చు.

3)ఇంకా చిన్న చిన్న టూల్స్ Wire stripper , Electric switch box (ఆరు చిన్నవి ఒక్కటి పెద్దది), టేప్,step ladder,సుత్తి,screw driver, అవసరం అనుకుంటే protective glasses కల్లకి .

ఇంకా వుంది...

No comments: