

ఆ కాలం లోనే వచ్చిన Dil Chahtha Hai(2001), Lagaan (2001) మొత్తం హిందీ సినిమా
గతినే మార్చాయి అని యే సంశయం లేకుండా ఖచ్చితంగా చెప్పొచ్చు.రెండు సినిమాలు వేటికవే క్లాసిక్స్ అని చెప్పొచ్చు.
ప్రతీ కాలం లోను కొన్ని defining events ఉంటాయి అవి మొత్తం ఆ తరువాత గతినే మార్చేస్తాయి. ఇది ఏ ఫీల్డ్ కయిన వర్తిస్తుంది.ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు ఆ కోవలోకి చెందినవే.ఫర్హాన్ అఖ్తర్, ఆశుతోశ్ గోవారికర్ లు ఒకే కాలం లో ఇలాంటి అద్బుతమయిన ఆలొచనలతో క్లాసిక్స్ ని మనకు ఇవ్వడం మన జెనరేషన్ చేసుకున్న అద్రుశ్ఠంగా అనుకోవచ్చు. క్రియేటివ్ గా ఒక సరి కొత్త ఆలోచన రావాలి అంటే, అదీ different గా & అద్బుతంగ వుందంటే, అదీ మన సినిమా ఫీల్డ్ లో వున్న ఫ్రీమేక్, రీమేక్ కల్చర్ మధ్యలోనుంచి రావటం అంటే ఆ ఇద్దరూ మేధావులు అనటంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు.
ఫర్హాన్ అప్పటి వరకు భారత సినిమా చూడని, చెయ్యని కొత్త ప్రయోగాలు ఎన్నో చెసాడు. కధని నడిపించిన విధానం, స్క్రీన్ ప్లే లో ఫ్రెష్నెస్,Charactors అన్నీ believable గా present చెయ్యడం , వారు ఎదురుకొనే అనుభవాలను సున్నితంగా deal చెయ్యడం, కాలానికి తగ్గట్టు గా modern & stylish గా వుంటూనే ఏది శ్రుతి మించకుండా అన్ని balanced గా వుంచడం ఈ సినిమాని క్లాసిక్ అనటానికి కొన్ని ఉధాహరణలు మాత్రమే.
ఇక ఆశుతోష్ మన భారత సినిమా కు సంభందించినంత వరకు Perfect Screenplay అంటే ఎలా వుండాలో చూపించాడు. నేను screenplay విశయం లో పెద్ద expert ని కాక పొవచ్చేమోగాని, కధ లో ఎక్కడా confusion లేకుండ , సినిమా మొత్తం చెప్పాల్సిన విశయాన్ని ఎక్కడా ఒక్క సీన్ లో కూడా తప్పుతోవ పట్టించకుండ exciting గా నడిపించడం, సినిమాలొ కధానుసారంగా చాలా ఎక్కువ క్యారక్టర్సే ఉన్నా కూడా అన్నింటిని perfectగా develop చేసి సినిమా మొత్తం ఆ consistency maintain చెయ్యడం, ఇవన్నీ ఇది మరో లిజెండరీ సినీమా అనడానికి కొన్ని reasons మాత్రమే.

ఇక మిల్లీనియమ్ లో వచ్చిన ఆ రెండు సినిమాలు, అవి తెచ్చిన మార్పు సంగతి చూస్తే, Lagaan & DCH రెండూ ప్రతి ఒక్కరి లో కొత్త ఆలోచనలు రావడానికి దోహద పడ్డాయి, Simple విశయాలను reality కి దగ్గరగా ఉంటూనే exciting గా చూపించడం అనేది మన సినిమాలకు సంభందించినంత వరకు కొత్తే, అలా తీసి కూడ సినిమా ని mainstream కి చేర్చొచ్చు అని,fixed మసాలా లేకుండ ఏ topic మీదైనా సినిమా తీయ్యొచ్చు లాంటి అద్బుతమైన పరినామాలకు దారి చూపాయి.
హీరొ చుట్టు కధ కాదు కధ చుట్టు పాత్రలు, పాత్రదారులు అని ఈ రెండు సినిమాలు మనకు నేర్పిన గొప్ప పాఠం.ఈ మార్పు మన సినిమాల్లొ రావాలని desperate గా ఎదురుచూసిన వాల్లకి గొప్ప పండగే.. Rang de basanti, Iqbaal, Being Cyrus, Khosla ka Ghosla, Lage raho munna bhai ఆ పరిణామ క్రమంలో వచ్చిన కొన్ని సినిమాలు అనొచ్చు. మార్పు అన్నది ఎక్కడయినా సహజం, మరి ఆ మార్పు ఇంత బావుంటే చాలా ఆనందం.
ఒక విదంగా చూస్తే షోలే కంటే కూడా ఈ రెండు (Lagaan & DCH) సినిమాలే గొప్పవి అనొచ్చేమో?
మరి అసలు విశయానికి వస్తే భారత సినిమా లో భాగమైన మన తెలుగు సినిమా పరిస్తితి ఏంటి? తెలుగు సినిమా future యేంటి?
మన వాళ్ళు గొప్పగా చెప్పుకొనే మయాబజార్, శంకరాభరణం మన సినిమాలలో ఏలాంటి మార్పునయినా తెచ్చయా? అంటే, లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
హిందీలో ఈ మధ్య వస్తున్న ఆ మంచి పరినామాలు మన తెలుగులో ఏందుకు మచ్చుకైనా కనపడటం లేదు?
కొన్ని decades నుంచి అవే ఫార్ములా కధలతో ఇప్పటికి ఇంకా తీస్తూనే ఉన్నారు.
మన వాళ్ళు కూడా కాలానికి తగ్గట్టు మరతారు తెలుసా? , మన వాళ్ళు నేర్చుకొనే విశయాలేంటయ్యా అంటే, హీరోని ఏంత innovative గా present చెయ్యొచ్చు screen మీద, హీరోయిజం ప్రొజెక్ట్ చెయ్యడానికి కొత్త camera techniques, special effects, కొత్త sound effects, హీరో యాంగిల్ లో తన గొప్ప తనాలు చాటుకొనే కొత్త కొత్త మాటలు, పాటలు వ్రాయడం, హీరో మీద పడిచచ్చే హీరోయిన్ కాలానికి తగ్గట్టు glamorous గా తయారు చెయ్యడం అవసరమయితే ముంబాయి నుంచయినా దిగుమతి చెయ్యటం. ఇంకా ఏన్నో ఏన్నెన్నో ఉన్నాయి మన గణతలు.

తెలుగు సినిమాలు శివ ముందు శివ తరువాత అన్నట్టు వుంటాయి అని కొద్ది మంది ఆశించారు, నిజంగా అలా జరిగింది కూడా, కాని అందులో ఉన్న కొత్త దనం, screenplayలో ఉన్నinnovativeness ని inspiration గా తీసుకోకుండ, మన వాళ్ళు ఇంకా పాత formula నే maintain చేస్తూ శివలో fights ని, హీరో ని ప్రొజెక్ట్ చెయ్యడానికి శివలో వాడిన techniques ని ఇంకా తిప్పి తిప్పి వాటినే రీమిక్స్ చేసి సినిమాలు చుట్టేస్తున్నారు.
మరి ప్రాబ్లం ఏక్కడ వుంది?
1) మొదటగా మంచి సినిమా అంటే ఆర్ట్ సినిమా, క్లాస్ సినిమా అనే ఒక మెంటాలిటీ క్రియేట్ చెసారు మన తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు.అది మారాలి.
2) సినిమా అనేది factory లో screws ఉత్పత్తి చేసినట్టు కాదు అని, ప్రతి ఒక్క తెలుగు సినిమా దిగ్గజం గుర్తించాలి. ప్రతి సినిమా ఒక creative product, అంటే ఒక సినిమాకి వేరొక సినిమాకి atleast యేదొ ఒక్క creative difference అన్నా వుండాలి. ఒక్క సారి painting fieldనే exampleగా తీసుకుంటే, ప్రతీ అర్టిస్ట్ ఒకే బొమ్మని గీసి ఏదో రంగులు మాత్రం మారిస్తే యెలా వుంటుంది చెప్పండి?
3)Mediocre ఆలోచనలతో తీసిన సినిమాని, గర్వంగా ఇది Mass cinema అని promote చేస్తూ, తెలుగు సినిమా ప్రేక్షకుడిని యేనాటికి ఎదగనీయకుండా చేస్తూ, మంచి సినిమా కావాలని కోరుకునే వారిని class గా బ్రన్డ్ చెయ్యడం మానెయ్యలి.
4)ఇంకో ప్రోబ్లమ్ కూడా వుంది, పాప్యులర్ యాక్టర్ లేకుండా తీసిన సినిమాని, అర్దం పర్దం లేని Pseudo sentiments తో తీసిన సినిమాని, అడ్డం పెట్టుకొని అది క్లాస్ సినిమా, మంచి సినిమా అని బ్రాండ్ చెయ్యడం మనని మనం మోసం చెసుకొవడమే అవుతుంది.
5)ఇవన్నీ ఎందుకండి frank గా మాట్లాడుకుంటే, మంచి సెన్సిబిలిటీస్ తో వున్న నిర్మాత,దర్శకులు,రచయితలు మనకు ఎందరున్నారు? కొత్త కధలు try చేద్దాం, ఎదో సరి కొత్త విశయం చెబుదాం అనే passion వున్నవాల్లు ఎంత మంది?
ఇంకా ఎంతో వ్రాయాలని వుంది may be next post లో...
No comments:
Post a Comment